వైసిపి అధినేత తీరుతో ఆ పార్టీ అభిమానులు,నాయకులు తలలు పట్టుకుంటున్నారు. 2019 ఎన్నికలు జరిగే వరకు జగన్ జనం మధ్యనే ఉన్నారు. ఎప్పుడైతే తనకు కావాల్సిన అధికారం దక్కిందో,ఇక అతను పార్టీని,అభిమానులను పట్టించుకున్నది లేదు. నిత్యం పధకాలు,ప్రజలు అంటూ చాలా బిజీగా ఉండేవారు జగన్ మోహన్ రెడ్డి గారు.
సొంత పార్టీ ఎం.ఎల్.ఏ లను,మంత్రులను కూడా కలవలేనంత బిజీగా ఉండేవారు జగన్ మోహన్ రెడ్డి. ప్రపంచంలో ఏ దేశ అధ్యక్షుడు కూడా ఇంత బిజీగా ఉండి ఉండడు.అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు తమకి కావాల్సిన పనులు చేయమంటారనో,నాలుగు రూపాయలు సంపాదించుకునే అవకాశం ఇవ్వమంటారనో దగ్గరికి కూడా చేరనివ్వలేదు జగన్ మోహన్ రెడ్డి.ఒకవేళ కలిసే అవకాశం ఇచ్చినా,సజ్జల,ధనుంజయ్ రెడ్లను ప్రసన్నం చేసుకున్నాకే అవకాశం వచ్చేది.
జగన్ మోహన్ రెడ్డి గారి పాలన నచ్చలేదో,బాబు గారు ఎక్కువ చేస్తామన్నారనో మొత్తానికి జగన్ గారిని పక్కన కూర్చోబెట్టారు.
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డబ్బులు సంపాదించుకునే మార్గం కోసమో,ఏదైనా లబ్ది చేకూర్చాలని అడగటం కోసమో నాయకులు తనను కలవాలనుకుంటున్నారని జగన్ మోహన్ రెడ్డి గారు అనుకుని ఉండవచ్చు.కానీ,ఇప్పుడు పరిస్థితి అది కాదు కదా? డజను కి కూడా ఒకటి తక్కువే అయన పార్టీ ఎం.ఎల్.ఏ ల సంఖ్య.
స్థానిక నాయకుల మాటకి విలువ లేకుండా, వాళ్ళ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా తాననుకున్న దాన్ని నాయకుల మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం ఎందుకు? తన భజన పరులతో సమావేశం అవ్వడం,తాను ఎం చేయాలనుకున్నాడో అది చెప్పడం, బెంగుళూరుకో ,ఇంటికో పరిమితమవ్వడం.ఇదా నాయకుడి లక్షణం? ఇప్పుడు కూడా జగన్ మోహన్ రెడ్డి అంత బిజీగా ఉంటే ఇక పార్టీకి పెట్టడం ఎందుకు…?