ముంబైలో ఇంగ్లాండ్ తో జరిగిన 5వ T20 భారత్ 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 247 పరుగులు సాధించింది.
ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. 54 బంతుల్లో 135 పరుగులు సాధించాడు. 37 బంతుల్లోనే 13 సిక్సర్లు,7 ఫోర్లతో సెంచరీ చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా,ఎలాంటి తడబాటు లేకుండా చూడ చక్కని షాట్లతో భారీ స్కోర్ సాధించాడు.