మున్సిపల్ ఎన్నికల సమయంలో తమ పార్టీ కార్పొరేటర్లను కూటమి నేతలు లోబరుకుంటున్నారని, అది కుదరకపోతే అన్యాయంగా కేసులు పెట్టి బెదిరిస్తున్నారని వైసిపి నేతలు వాపోతున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తున్నారు. నయానో,భయానో అధికార పార్టీ, ప్రత్యర్థి పార్టీ కార్పొరేటర్లను లోబరుచుకుంటున్నారు. మరీ మఖ్యంగా గత 10 సంవత్సరాలుగా ఇలాంటి చర్యలు ఎక్కువయ్యాయి.
2014-2019 మధ్యన తెలుగుదేశం పార్టీకి ఇలాంటి పనులను తెరలేపగా, తామేమి తక్కువ తినలేదంటూ 2019-2024 మధ్యన అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వం అంతకన్నా ఎక్కువే ఇలాంటి అప్రజాస్వామిక పనులు చేసింది.
ఇలాంటి అప్రజాస్వామిక చర్యల ద్వారా ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలనేది అధికార పార్టీ ఆలోచన.