వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి మైకు కనబడితే చెప్పే మొదటి మాట, మాట ఇస్తే మడమ తిప్పనని.తరచూ కాకపోయినా,అయన కూడా మాట తప్పుతూనే,మడమ తిప్పుతున్నారు. తాను ఓడిపోయాక,ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థులు ఫీజులు సకాలంలో చెల్లించటం లేదని,విద్యార్థులకు వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని కోరుతూ, ఈనెల 5న ‘ఫీజు పోరు’ చేస్తున్నామంటూ పోస్టర్లు కూడా వదిలారు.
జగన్ మోహన్ రెడ్డి గారికి తాను అనుక్కున్నది చేయటం తప్ప, తమ పార్టీ నాయకుల అభిప్రాయాలు,సలహాలు టిఇసుకునే అలవాటు లేదు. ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని వైసిపి నాయకుల ఆలోచన.కానీ జగన్ మోహన్ రెడ్డి గారు,వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ‘ఫీజు పోరు’ అంటూ పోస్టర్లు కూడా రిలీజ్ చేయించాడు.
ఇప్పటికే రెండు సార్లు ఈ ‘ఫీజు పోరు’ ను వాయిదా వేశారు,ఇది ముచ్చటగా మూడోసారి వాయిదా వేయడం.ఎం.ఎల్.సి ఎన్నికల కోడ్ ఉందని తెలుసు,ఇప్పటికే పలు దఫాలు ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారని తెలుసు. అయినా కూడా ఏ మాత్రం ఆలోచన లేకుండా ఇలాంటి కార్యక్రమాలను చేపట్టడం, నాయకులు,కార్యకర్తలు సిద్ధంగా ఉండాలంటూ పిలుపునివ్వడం, రద్దు చేయడం,కార్యకర్తలను నీరుగార్చడం.
జగన్ మోహన్ రెడ్డి ఇప్పటి వరకు కార్యకర్తలకు చేసింది ఏమీ లేదు. అయినా కానీ,ఇంకా గుడ్డి నమ్మకంతో అతని వెనక నడుస్తున్నారు. ఆయనేమో బెంగుళూరు,లండన్ విహారయాత్రలు బాగానే చేసుకుంటున్నాడు. పార్టీని నమ్ముకున్న వారికి,అండగా ఉన్న వారికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా,తాను చెప్పిందే వేదం అన్నట్లు జగన్ ప్రవర్తించే తీరుతో విసుగు తెప్పించే పరిస్థితి.
అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుండా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఎందుకూ, వాయిదాలు వేయడం ఎందుకూ ? ఈ మాత్రం వాయిదాలకు పోస్టర్లు,బ్యానర్లంటూ హడావుడి చేయడమెందుకు? ఇలాంటి తలా,తోక లేని పనులతో ఉన్న నమ్మకం పోగొట్టుకోవడం తప్ప జగన్ మోహన్ రెడ్డికి వచ్చేదేమీ లేదు.