గన్నవరం టిడిపి కార్యాలయం పై దాడి కేసులో మాజీ ఎం.ఎల్.ఏ వల్లభనేని వంశీని హైదరాబాద్ లో అరెస్ట్ అరెస్ట్ చేశారు.వంశీతో పాటు అయన అనుచరులు ఐదుగురిని హైదరాబాద్ రాయదుర్గంలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
తెలుగుదేశం కార్యాలయం పై దాడి కేసులో ముందస్తు బెయిల్ ఉన్న తనను ఎలా అరెస్ట్ చేస్తారని పోలీసులతో వాగ్వివాదం చేశారు వంశీ.మరొక కేసులో అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు వివరణ ఇచ్చారు.
తెలుగుదేశం కార్యాలయం పై వంశీ,అతని అనుచరులు దాడి చేశారంటూ సత్యవర్ధన్ అనే అతను కేసు నమోదు చేశారు. వంశీ అనుచరుల బెదిరింపులతో ఆ కేసును సత్యవర్ధన్ వాపస్ తీసుకున్నామని సత్యవర్ధన్ తల్లి తాజాగా పేర్కొన్నారు. బెదిరింపుల నేపథ్యంలో అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు.
తాజాగా అందిన సమాచారం మేరకు మట్టి త్రవ్వకాల్లో అరెస్ట్ చేశారని తెలుస్తుంది. రాయదుర్గంలో అరెస్ట్ చేసిన వంశీని విజయవాడ తరలిస్తున్నారు.ఏ కేసులో అరెస్ట్ చేశారనేది తెలియాల్సి ఉంది.