సంబంధిత వార్తలు

బాపట్ల పర్యాటక ప్రాంతాల్లో నిలువు దోపిడి

బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ పర్యాటకులతో నిత్యం రద్దీగా ఉంటుంది. వారాంతంలో హైదరాబాద్,బెంగుళూరు ప్రాంతాల నుండి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా ఎక్కువే.జిల్లాలో సూర్యలంక,రామాపురం,పాండురంగాపురం,ఓడరేవులు కాస్త పేరున్న బీచ్లు.

గోవా,చెన్నై,విశాఖలతో పోల్చుకుంటే చీరాల,బాపట్లలో రిసార్ట్స్ ఖర్చులు తక్కువగా ఉండటంతో,తెలంగాణా,ఆంధ్రాలో ఉన్న ఇతర ప్రాంతాల నుండి ఎక్కువగా పర్యాటకులు వస్తుంటారు.

ఇక్కడి వచ్చే పర్యాటకుల జేబులకు చిల్లులు పెడుతున్నారు స్థానిక నేతలు. ఆటో,కారు ఏ వాహనానికైనా టోల్ కట్టాలంటూ దబాయించి వసూలు చేస్తున్నారు. లేదంటే రోడ్డుకి అడ్డంగా గేట్లు పెట్టి బీచ్ దగ్గరకు కూడా వెళ్ళడానికి వీల్లేదంటూ దబాయిస్తున్నారు.

కొన్ని ప్రాంతాల్లో స్థానిక వైసిపి నేతలు ఈ టోల్ వసూళ్లకు అడ్డుపడటంతో తాత్కాలికంగా ఆపేసినప్పటికీ,రద్దీగా ఉండే సూర్యలంకలో మాత్రం వసూళ్ల దందా కొనసాగుతుంది.

సంబంధిత వార్తలు