ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మహిళా పక్షపాతినని,మహిళలకు అన్యాయం జరిగితే తన గుండె తరుక్కుపోతుందని పలు సందర్భాల్లో చెప్పారు.వైసిపి అధికారంలో ఉండగా 30 వేల మహిళల ఆచూకీ తెలియకుండా పోయిందని వాపోయారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలకు బొత్తిగా రక్షణ లేకుండా పోయిందని పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం. ఈసంగతులన్నీ తనకు కేంద్ర నిఘా సంస్థలు ప్రత్యేకంగా తెలియజేశారని చెప్పేవారు.
ఇదంతా గతం,ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి డిప్యూటీ సి.ఎం. అంటే రాష్ట్రానికి చంద్రబాబు గారి తరువాత పెద్ద దిక్కన్నమాట. ఇంతటి స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు, గతంలో తప్పి పోయిన 30 వేల మహిళల గురించి పట్టించుకుంటున్నారా లేదా? లేదనే సమాధానం వస్తుంది సామాన్యుల్లో.పవన్ కళ్యాణ్ కీలకంగా ఉన్న కూటమి ప్రభుత్వం కొలువుదీరాక రాష్టంలో మహిళలపై దాడులు,అకృత్యాలు పెరిగాయనే చెప్పాలి. దీనిపై హోం మంత్రి వంగలపూడి అనితను కూడా తప్పుబట్టారు పవన్ కళ్యాణ్ గారు.
ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళల మీద దాడులు పెరిగాయనే చెప్పాలి. ప్రతిపక్షంలో ఉండగా మహిళల మీద అకృత్యాలు పెరిగిపోయాయని గొంతు చించుకున్న పవన్ కళ్యాణ్,తానూ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరుగుతున్న దాడులపై మాత్రం నోరు మెదపడం లేదు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన 8 నెలలో మహిళల పై జరిగిన అకృత్యాలు చూస్తే
కడపలో ప్రేమోన్మాది దాడిలో దస్తగిరమ్మ అనే బాలిక మృతి
తెనాలిలో రాగి నవీన్ అనే సైకో దాడి,అపస్మారక స్థితిలో మహిళ.
పలాసలో విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.
తిరుపతిలో మూడు సంవత్సరాల బాలికపై అత్యాచారం,హత్య.
తిరుపతి యర్రావారిపాలెంలో 14 సంవత్సరాల బాలికపై అత్యాచారం.
అన్నమయ్య జిల్లా కదిరిలో యువతికి యాసిడ్ తాగించి,కత్తితో దాడిచేసిన తెలుగుదేశం నేత కుమారుడు.
కూటమి అధికారం చేపట్టాక 8 నెలల్లోనే,మహిళలపై 100 కి పైగా అత్యాచారాలు,హత్యలు జరిగాయి.బాధ్యతల గల పవన కళ్యాణ్ కి ఈ అకృత్యాలు కనిపించడం లేదా? జగన్ అధికారంలో ఉండగా మహిళలపై దాడులంటూ నిత్యం గోల చేసిన పవన్ కళ్యాణ్,నేటి కీచకపర్వం పై మాట్లాడడే ?