సంబంధిత వార్తలు

ఇదే చంద్రబాబును ఇంకా భయపెడుతుంది

2024 శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం తెలుగుదేశం నాయకులన్నమాట, “జగన్ ఓడిపోయాడు కానీ,చనిపోలేదని”. తెలుగుదేశం నాయకులు ఈ ఎన్నికల విజయం చూసుకుని,ఎదో మేకపోతు గాంభీర్యం ప్రదరిస్తున్నారు కానీ,జగన్ అంటే ఇంకా భయంగానే ఉన్నారు.

దీనికి ప్రధాన కారణం , జగన్ పార్టీకి 40 % ఓట్లు రావడమే. ఒక ప్రాంతీయపార్టీకి 40 % ఓట్లంటే,చాలా బలంగా ఉన్నట్లే. గెలిచింది 11 సీట్లే కానీ, ఓటమికి ప్రధాన కారణం కేవలం తన పాలనలో జగన్ తన పాలనలో చేసుకున్న స్వయంకృతమే తప్ప, పూర్తిగా ప్రత్యర్థుల విజయమైతే కాదు.

జగన్ బలమేంటో చంద్రబాబుకి తెలిసినంతగా మరెవరికీ తెలియదు. అందుకే బిజేపి,జనసేన మద్దతుతో ఎన్నికలకు వెళ్ళాడు. పులివెందులతో ప్రారంభమైన జగన్, 17 స్థానాలతో ఉనికిని చాటుకుంది. తరువాత 67 స్థానాలతో బలమైన ప్రతిపక్షంగా నిలబడింది. చంద్రబాబు వైసిపిని లేకుండా చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడో అందరికి తెలుసు.

తన పాలనలో కార్యకర్తలను పట్టించుకోక పోవడం,కాపు సామాజికవర్గంలో పూర్తిగా పట్టు కోల్పోవడం,సొంత సామాజికవర్గాన్ని నిర్లక్ష్యం చేయడం వలన మాత్రమే జగన్ ఘోర ఓటమిని మూటగట్టుకున్నాడు తప్పితే, పూర్తిగా కూటమి విజయమైతే కాదు.

జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో తన బలం ఏంటో తెలుసుకోలేకపోయాడు కానీ,ఓటమి తరువాత అతనికి తెలిసోచ్చింది. వైసిపి కార్యకర్తలకు కూడా తాము ఏం కోల్పాయామనేది కూటమి కూటమి ప్రభుత్వం చేస్తున్న చేష్టల ద్వారా ఇప్పటికే తెలుసుకున్నారు.జగన్ పాలనలో గుర్తింపు లేదు కానీ, ప్రస్తుత కూటమి పాలనలో రక్షణ లేదు,మర్యాద అంతకన్నా లేదు.

జగన్ కూడా ఈసారి అధికారంలోకి వస్తే, గతంలోలా తప్పులు చేయనని,కార్యకర్తకు అండగా ఉంటాననే మాట పదే,పదే చెప్తున్నాడు. జగన్ ఇస్తున్న ఈ భరోసాతో ఆ పార్టీ కార్యకర్తలు కూడా మళ్ళీ పార్టీకి దగ్గరవుతున్నారు.ఇదే చంద్రబాబును గాబరా పెడుతున్న అంశం.

జగన్ అమలు చేసిన సంక్షేమ పధకాలన్ని ఇంకా మెరుగ్గా అమలుపరుస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, జగన్ పాలనను బూచిగా చూపిస్తున్నారు.ఇలా చేయడం ద్వారా,పధకాలు వర్తించని కొన్ని వర్గాలను జగన్ కి దూరం చేయాలనేది బాబు గారి ప్రయత్నం.

తాజాగా వల్లభనేని వంశీని జైల్లొ కలవడానికి వచ్చిన జగన్ కి పార్టీ కార్యకర్తల నుండి అనూహ్య మద్దతు లభించింది.సామాన్యులు కూడా జగన్ని చూడటానికి బారులు తీరారు.ఓటమి నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వైసిపి అభిమానులకు ఇది ఎంతో ఉత్సాహన్నిస్తుంది.జనంలో తిరగడమే జగన్ భలం.గతంలొ చంద్రబాబు జగన్ని ఎన్ని విధాలా దెబ్బకొట్టినా,పుంజుకుని లేచి నిలబడిన చరిత్ర జగన్ ది.

జగన్ ప్రజాబలం చంద్రబాబుకి మింగుడుపడటం లేదనే చెప్పాలి.అవినీతిపరుడని ముద్రవేసినా,పాలన చేతగాదని చెప్పినా, జగన్ బలం ఏమాత్రం తగ్గకపోగా,ఓంటరిగా పోటీ చేసే స్థితిలో చంద్రబాబు గారు లేరు.పధకాల అమలులొ చంద్రబాబు ఇప్పటికే చెతులెత్తేశారు.మరొక వైపు జగన్ కి దూరమైన సొంత పార్టీ క్యాడర్ క్రమంగా దగ్గరవుతుంది.రేపటి రోజున పధాకలు అందనివారు జగన్ కి దగ్గరైతే మాత్రం చంద్రబాబుకి కష్టాలు తప్పవు.

సంబంధిత వార్తలు