కరాచీ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ పై న్యూజిలాండ్ 60 పరుగుల తేడాతో విజయం సాధించింది.అతిధ్య దేశం పాకిస్తాన్ ఏ దశలోనూ కూడా న్యూజిలాండ్ పై పైచేయి సాధించలేకపోయింది.
మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది.ఓపెనర్ విల్ యంగ్ 107 పరుగులు, టామ్ లాథం 118 పరుగులు, గ్లెన్ ఫిలిప్స్ 61 పరుగులతో రాణించారు.
321 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్, ఏ దశలోనూ న్యూజిలాండ్ కు ధీటుగా బదులువ్వలేక పోయింది.ఓపెనర్ బాబర్ అజమ్ 64 పరుగులు, కుష్ దిల్ షా 69 పరుగులు సాధించారు.న్యూజిలాండ్ బౌలర్లలో మాట్ హెన్రీ 2 వికెట్లు, ఓరుక్ 3 వికెట్లు,కెప్టెన్ మిచెల్ శాంట్నర్ 3 వికెట్లు తీశారు.

