సంబంధిత వార్తలు

వై.యస్ కంటే గొప్ప పాఠం ఏముంది జగన్?

తెలుగు రాష్ట్రాల రాజకీయాల ప్రస్తావన వస్తే, డాక్టర్ వై.యస్.ఆర్ ముందు,తరువాత అనే వాదన ఖచ్చితంగా వస్తుంది.అంతటి ప్రభావం.చూపారు వై.యస్.ఉమ్మడి రాష్ట్రంలో పడకేసిన కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చిన నాయకుడు వై.యస్. 2004 లో కాంగ్రెస్ గెలుపులో ప్రధాన పాత్ర వై.యస్ ది కీలకపాత్ర. తన పాదయాత్రతో అప్పటివరకు శవాసనం వేసిన కాంగ్రెస్ ను అధికార పీఠం ఎక్కించారు వై.యస్.

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కూడా అప్పటి రాష్ట్ర ఎంపీల సంఖ్యే కీలకమైంది. వై.యస్ కు ఉత్తరాంధ్రాలో బొత్స,సీమలో రెడ్డి నాయకులతో పాటు బలమైన యాదవవర్గానికి చెందిన రఘువీరారెడ్డి,బలిజ సామాజికవర్గం నుండి సాయిప్రతాప్,తెలంగాణాలో సభిత ఇంద్రారెడ్డి,కోమటిరెడ్డి ,దానం లాంటి బలమైన నేతల టీమ్ ఉండేది. తన టీమ్ ను ఎప్పుడు కూడా వై.యస్ డమ్మీలుగా చూడలేదు,మార్చాలనుకోలేదు.

సంబంధిత వార్తలు