సంబంధిత వార్తలు

ఛాంపియన్స్ ట్రోఫీ: బంగ్లా పై భారత్ విజయం

దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా,నిర్ణీత 49.4 ఓవర్లలో 228 పరుగులు చేసింది. ఓ దశలో 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ ను మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ తౌహీద్ హ్రిదోయ్,జాకిర్ అలీ ఆదుకున్నారు. తౌహీద్ హ్రిదోయ్ 100 పరుగులు చేయగా జాకిర్ అలీ 68 పరుగులు చేశాడు.

గాయం తరువాత జట్టులోకి వచ్చిన మహమ్మద్ షమీ 5 వికెట్లు తీయగా,హర్షిత్ రాణా 3 వికెట్లు,అక్సర్ పటేల్ 2 వికెట్లతో రాణించారు.మహమ్మద్ షమీ వన్డేల్లో 200 వికెట్లు సాధించాడు.

229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 46.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి లక్ష్యం చేధించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ 41 పరుగులు చేయగా, గిల్ 9 ఫోర్లు,2 సిక్సర్లతో 101 పరుగుల చేసి అజేయంగా నిలిచాడు. కె.ఎల్ రాహుల్ 41 పరుగులతో రాణించాడు. .

సంబంధిత వార్తలు