ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో పాక్ పై భారత్ ఏక పక్ష విజయం సాధించింది.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ కి దిగిన పాకిస్తాన్ జట్టు 49.4 ఓవర్లలో 241 పరుగులకు అలౌటైయింది. పాకిస్థాన్ జట్టులో సౌద్ షకీల్ 62 పరుగులు, రిజ్వాన్ 42 పరుగులు, కుష్ దిల్ షా 38 పరుగులతో రాణించారు.
చక్కటి లైన్ అండ్ లెంగ్త్ తో భారత బౌలర్లు పాక్ బ్యాట్స్మెన్లను పరుగులు చేయకుండా కట్టడి చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, హార్దిక్ పాండ్యా 2 వికెట్లు, రవీంద్ర జడేజా,హర్షిత్ రాణా, అక్షర్ పటేల్ తలొక వికెట్ తీశారు.
242 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఓపెనర్లు గిల్,రోహిత్ చక్కటి శుభారంభాన్నిచ్చారు. రోహిత్ శర్మ 20 పరుగులు చేయగా,గిల్ 46 పరుగులకు అవుటయ్యాడు. తరువాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ 56 పరుగులు చేయగా, కింగ్ కోహ్లీ 7 ఫోర్లతో 100 పరుగులతో అజేయంగా నిలవగా, టీమిండియా 42.3 ఓవర్లలోనే అలవోకగా విజయం సాధించింది.ఈ సెంచరీ తో కింగ్ కోహ్లీ వన్డేల్లో 51 సెంచరీలు చెసినట్లయింది.