సంబంధిత వార్తలు

ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా

ఏపీ లో అధికార తెలుగుదేశానికి చిన్నపాటి షాక్ తగిలింది. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీ.వీ.రెడ్డి చైర్మన్ పదవికి, తెలుగుదేశం ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.ఇటీవల మీడియా సమావేశంలో ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ పై జీ.వీ.రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అతని వలెనే ఫైబర్ నెట్ కార్పొరేషన్ పెద్ద మొత్తంలో నష్టాన్ని చవిచూసిందని జీ.వీ.రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖలు తీవ్ర దుమారం రేపాయి.దీనితో ఐఏఎస్ అధికారులందరూ చంద్రబాబును కలిసి, తమ ఆవేదనను వెళ్లగక్కటంతో చంద్రబాబు గారు జీ.వీ.రెడ్డి పిలిచి మందలించారు.

జీ.వీ.రెడ్డిని చంద్రబాబు మందలించటం వలనో ,మరే కారణమో జీ.వీ.రెడ్డి తన పదవికి రాజీనామా చేశాడు . వ్యక్తిగత కారణమని జీ.వీ.రెడ్డి చెప్తున్నప్పటికీ, అవినితి అధికారి దినేష్ కుమార్ తరుపున చంద్రబాబు మాట్లాడం వలన జీ.వీ.రెడ్డి నొచ్చుకుని, తన పదవికి రాజీనామా చేశారని తెలుస్తుంది.

సంబంధిత వార్తలు