ఇంకొద్ది రోజుల్లో వేసవి కాలం మొదలవుతుంది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు రోజు రోజుకి ఎక్కువ నమోదు అవుతున్నాయి. ఏప్రిల్ మే నెలల్లో ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ ఎండలకు సాధారణ మనుషులే చాలా ఇబ్బంది పడుతారు. డీహైడ్రేషన్ కు గురి కావడం, వడ దెబ్బ బారిన పడటం జరుగుతూ ఉంటుంది. చిన్న పిల్లలు, ముసలి వారిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటామో అదే విధంగా కీమోథెరపీ , రేడియోథెరపీ తీసుకుంటున్న క్యాన్సర్ రోగులను కూడా చూసుకోవాలి మరియు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి.
1. రోజుకి 8-10 గ్లాసుల లేదా 4 లీటర్ల మంచి నీరు తీసుకోవాలి. మంచి నీరు తక్కువగా తీసుకుంటే కీమోథెరపీ తీసుకునే వారిలో కిడ్నీలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
2. శరీరానికి చలువ చేసే తొక్క తీసివేసిన పండ్లు , కీరా వంటి తాజా కూరగాయలు ప్రతి రోజు తీసుకోవాలి
3. మజ్జిగ, రాగిజావ, కొబ్బరి నీరు, సగ్గు బియ్యం వంటి ద్రవాలు తీసుకోవాలి
4. ఉదయాన్నే తేలికపాటి వ్యాయామాలు చేయాలి
5. వీలైనంత వరకు ఎండలో బయటకు వెళ్ళకూడదు
6. లేత రంగు తేలిక పాటి వస్త్రాలు ధరించాలి
7. ఆహారంలో మసాలాలు, నూనెలు అధికంగా లేకుండా, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి.