సంబంధిత వార్తలు

ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్

దుబాయ్ వేదికగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా విజేతగా నిలిచింది. టోర్నీ మొదటి నుండి నిలకడైన ఆట తీరును ప్రదర్శించిన టీమిండియా,ఫైనల్లో కూడా అదే ప్రదర్శనను కొనసాగించింది.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజీలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది.

న్యూజీలాండ్ జట్టులో రచిన్ రవీంద్ర (29 బంతుల్లో 37 పరుగులు,4 ఫోర్లు,1 సిక్స్ ),డరెల్ మిచెల్ (101 బంతుల్లో 63 పరుగులు,3 ఫోర్లు),గ్లెన్ ఫిలిప్స్ (52 బంతుల్లో 34 పరుగులు,2 ఫోర్లు,1 సిక్స్ ), మైకేల్ బ్రెష్ వెల్ (40 బంతుల్లో 53 పరుగులు,3 ఫోర్లు,2 సిక్సులు ) సాధించారు.షమీ,రవీంద్ర జడేజా తలొక వికెట్ తీయగా,కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు,వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీశారు.

252 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా,లక్ష్యాన్ని 49 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి చేధించింది.ఓపెనర్లు గిల్,రోహిత్ శర్మ టీమిండియా కు చక్కటి శుభారంభాన్నిచ్చారు. గిల్ (50 బంతుల్లో 31 పరుగులు, 1 సిక్స్), రోహిత్ శర్మ (83 బంతుల్లో 76 పరుగులు, 7 ఫోర్లు, 3 సిక్సులు), శ్రేయాస్ అయ్యర్ (62 బంతుల్లో 48 పరుగులు, 2 ఫోర్లు, 2 సిక్సులు), అక్షర్ పటేల్ (40 బంతుల్లో 29 పరుగులు, 1 ఫోర్ , 1 సిక్స్ ), కె.ఎల్.రాహుల్ అజేయంగా (33 బంతుల్లో 34 పరుగులు, 1 ఫోర్ , 1 సిక్స్ ) చేశారు.

రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలవగా, టోర్నీ మొత్తం మీద 263 పరుగులు,3 వికెట్లు తీసిన రచిన్ రవీంద్ర నిలిచాడు.

సంబంధిత వార్తలు