ఇప్పటికే పదవ తరగతి పరీక్షలు మొదలయ్యాయి. వచ్చే నెలలో మిగిలిన తరగతుల పిల్లలకు ఎగ్జామ్స్, ఎంసెట్, నీట్ లాంటి పోటీ పరీక్షలు రాబోతున్నాయి. చాలా మంది సంవత్సరం అంతా బాగానే ప్రిపేర్ అయినా ఎగ్జామ్స్ దగ్గరకి వస్తున్నాయంటే హడలి పోతుంటారు. చాలా ఒత్తిడికి లోనవుతుంటారు.
అలాంటి వారి కోసం కొన్ని సూచనలు:
1. ముందుగా ఒక టైమ్ టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ టైం టేబుల్ లో మీకు సులభంగా ఉండే టాపిక్స్ కి తక్కువ సమయం, కష్టం గా ఉండే టాపిక్స్ కి ఎక్కువ సమయం వచ్చేలా కేటాయించుకోవాలి.
2. ఎదైనా టాపిక్ అర్థం కాకపోతే టెన్షన్ పడకుండా టీచర్లు లేదా ఫ్రెండ్స్ తో డిస్కస్ చేస్తూ చదివితే గుర్తుండిపోతుంది.
3. ప్రీవియస్ పేపర్స్ లో యే టాపిక్స్ మీద ఎన్ని ప్రశ్నలు వచ్చాయో వెయిటేజ్ చూసుకుని ఎక్కువ వెయిటజ్ ఉన్న టాపిక్స్ కి ఎక్కువ సమయం కేటాయించుకోవాలి.
4. ముందుగానే నోట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చివరి నిమిషంలో రివిజన్ చాలా తేలిక అవుతుంది.
5. వేళకు సరైన ఆహారం, నిద్ర , వ్యాయామం తప్పనిసరి.
6. పది నిమిషాలు మెడిటేషన్ చేయటం ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చు.